సంక్షేమమా! సంక్లిష్టమా..?

ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ పై ఒక పరిశీలన



భారీ వ్యయంతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తొలి బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. 2019-20 ఆర్థిక సంవత్సర బడ్జెట్ రూ 2.28 లక్షల కోట్లుగా ఉంటుందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పేర్కొన్నారు. 2018-19 సవరించిన బడ్జెట్ కంటే ఈ బడ్జెట్ కి రూ.64,842 కోట్లు అదనంగా ఆదాయం వస్తుందని అంచనా వేశారు. నవరత్నాల పథకాలే కేంద్ర బిందువుగా ఈ బడ్జెట్లో కేటాయింపులు జరిగాయి. 2019-20 పూర్తి స్థాయి బడ్జెట్ కి కేంద్ర ప్రభుత్వ పన్నుల వాటా నుండి రూ.34,833 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వ సొంత పన్నుల నుండి రూ. 75,438 కోట్లు, పన్నేతర ఆదాయం రూ.7,354 కోట్లు, కేంద్ర ప్రభుత్వ గ్రాంట్ల నుండి రూ.61,071 కోట్లు ఆదాయం వస్తుందని పేర్కొన్నారు. వీటితో పాటు అప్పుల ద్వారా రూ.49,277 కోట్లు సమీకరించాలని నిర్ణయించారు. అలాగే రెవిన్యూ లోటు రూ.1,778 కోట్లు, ద్రవ్యలోటు రూ.35,260 కోట్లు ఉంటుందని ద్రవ్యలోటు రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జి.డి.పి)లో సుమారు 3.30 శాతం ఉంటుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ కేటాయింపులు చూస్తే మొత్తం బడ్జెట్లో సుమారు రూ.75 వేల కోట్లు వివిధ పథకాలకు కేటాయించారు. ఇది రాష్ట్ర మొత్తం రెవిన్యూ వ్యయంలో 39 శాతంగా ఉంది. వీటిలో ముఖ్యమైనవి 'అమ్మ ఒడి' పథకానికి రూ.6,455 కోట్లు, పింఛన్లకు రూ.15,746 కోట్లు, రైతు భరోసారి రూ.8,750 కోట్లు, విద్యా దీవెనకి రూ.4,962 కోట్లు, నీటి ప్రాజెక్టులకి రూ.13,139 కోట్లు, ఉచిత విద్యుత్ కి రూ. 4,525 కోట్లు, ధరల స్థిరీకరణకు రూ.3,000 కోట్లు, డ్వాక్రా మహిళల వడ్డీ లేని రుణాలకు రూ.1,788 కోట్లు, అగ్రిగోల్డ్ బాధితులకు రూ.1,150 కోట్లు, ఆరోగ్యశ్రీ కి రూ.1,740 కోట్ల నిధులు కేటాయించారు. ప్రభుత్వం అంచనా వేసిన ఆదాయాలు రాకపోతే బడ్జెట్ కేటాయింపులన్నీ తల్లకిందు లౌతాయి. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం రెండు ప్రధాన పద్దుల నుండి ఎక్కువ ఆదాయాలను ఆశిస్తున్నది. రాష్ట్ర సొంత పన్నుల నుండి ఈ బడ్జెట్ కి సుమారు రూ. 17 వేల కోట్లు గత ఏడాది కన్నా అదనంగా చేకూరుతుందని అంచనా వేసింది. గత ఏడాది రాష్ట్ర సొంత పన్ను వనరులైన రిజిస్ట్రేషన్లు, స్టాంపుల డ్యూటీ, ఎక్సైజ్ సుంకం, వాహన పన్ను, వస్తు అమ్మకం, వాణిజ్య పన్నుల ద్వారా రూ.65,535 కోట్లు వస్తుందని అంచనా వేయగా రూ. 58,125 కోట్లు వస్తుందని సవరించిన బడ్జెట్లో పేర్కొన్నారు. 2019-20లో రూ.75,437 కోట్లు చూపారు. రూ.17. వేల కోట్లు అదనంగా ఆదాయం రావాలంటే తప్పనిసరిగా పన్నులు పెంచాల్సిందే. ఒకవేళ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటే ప్రస్తుత పన్ను రేటు ద్వారానే అదనపు ఆదాయాన్ని పొందవచ్చు. కాని ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆ దిశగా లేదు. రెండోది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్- ఇన్-ఎయిడ్' కింద ఎక్కువగా నిధులొస్తాయని ఆశిస్తున్నారు. గత ఏడాది కంటే ఏకంగా మూడు రెట్లు అధికంగా ఈ పద్దు కింద కేంద్రం నుండి ఆదాయం వస్తుందని లెక్కించారు. అంటే ఈ ఏడాది కేంద్ర సహాయ గ్రాంట్ల కింద రూ.61,071 కోట్లు వస్తుందని అంచనా. వాస్తవంగా 2018-19 బడ్జెట్లో కేంద్రం నుండి రూ.50,695 కోట్లు వస్తుందని ప్రతిపాదించి సవరించిన బడ్జెట్లో దీనిని రూ.19,456 కోట్లకు కుదించారు. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన 4 ఏళ్ళలో గ్రాంట్ల కింద రాష్ట్రానికి 2015-16లో రూ.21,927 కోట్లు, 2016-17లో రూ.23,346 కోట్లు, 2017-18లో రూ.22,760 కోట్లు, 2018-19 సవరించిన అంచనాల ప్రకారం రూ.19,456 కోట్లు మాత్రమే ఇచ్చారు. గత ఐదేళ్ల వరుస బడ్జెట్లను పరిశీలిస్తే కేంద్రం నుండి గ్రాంట్ల రూపంలో రూ.24 వేల కోట్ల దాటి ఎప్పుడూ రాలేదు. పైపెచ్చు 2019-20 బడ్జెట్లో మోడీ " ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన పథకాలేమీ లేవు. కేవలం రైతులకు వ్యవసాయ పెట్టుబడి సహాయ పథకం కింద రూ.6 వేలు తప్ప అదనంగా కొత్త పథకాలేమీ లేవు. ఈ పద్దు కింద వచ్చే కేంద్ర నిధులు రాష్ట్రం ఇష్టం వచ్చినట్లు ఖర్చుచేయటానికి, ఇతర కార్యకలాపాలకు మళ్ళించటానికి వీలు ఉండదు. అంగన్ వాడీ, ఆశా స్కీము వర్కర్లు, వీటి కింద నడిచే పథకాలు, గ్రామీణ ఉపాధి హామీ, గృహ నిర్మాణం, పింఛను, స్వచ్ఛభారత్, స్మార్ట్ సిటీ, అమృత ఇలా అనేక పథకాలకు గ్రాంట్-ఇన్- ఎయిడ్' కింద రాష్ట్రాలకి కేంద్రం నిధులు ఇస్తుంది. కొన్నింటికి కేంద్రం వాటా 90 శాతం ఉంటే మరికొన్నింటికి కేంద్ర, రాష్ట్రాలు 60:40 నిష్పత్తిలో నిధులు భరిస్తాయి. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం ఈ పద్దు కింద అతిగా అంచనాలు వేసింది. మోడీ ప్రభుత్వంతో సఖ్యతగా ఉండి నిధులు తెచ్చుకో వచ్చనే ఆలోచనలో ఉంటే అది భ్రమగానే మిగులుతుంది. గతంలో చంద్రబాబు నాయుడు, మోడీల చెలిమి అనుభవం మనకి తెలిసిందే. ప్రత్యేక హెూదా, విభజన హామీల అమలులో బిజెపి చేసిన ద్రోహమూ కనబడుతూనే ఉంది. కనుక 2019-20 బడ్జెట్లో కనీసం రూ.40 నుండి రూ.50 వేల కోట్ల మేర కేటాయింపులకు కోత పడే అవకాశం ఉంది. ఈ కోత నవరత్నాల మీద పడుతుందా లేదా వివిధ రంగాల మీదా లేదా ఇతర అభివృద్ధి కార్యకలాపాల మీద పడుతుందా? అనేది ఆచరణలో తేలుతుంది. ఒక వేళ తగ్గే ఆదాయాన్ని అప్పుల ద్వారా అదనంగా సేకరించి భర్తీ చేసుకోవచ్చనుకొన్నా అది సాధ్యమయ్యేది కాదు. ఇప్పటికే రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు. 2018 మే 30 నాటికి రాష్ట్ర అప్పు రూ.2.61 లక్షల కోట్లకి చేరింది. ఇది జిడిపిలో 28 శాతంగా ఉంది. 2019-20 బడ్జెట్ రూ.49,277 కోట్లు సేకరించాలని నిర్ణయించారు. ఈ అప్పులపై వడ్డీ, అసలు కలిపి రూ.30 వేల కోట్లు తీర్చాలి. ద్రవ్యలోటు, బడ్జెట్ మేనేజ్మంట్ చట్టం (ఎఫ్.ఆర్.బి.ఎం) ప్రకారం రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో ద్రవ్యలోటు 3 శాతం కంటే మించకూడదు. ఇది ఈ బడ్జెట్లో 3.3 శాతంగా ఉంటుందని అంచనా వేశారు. ఒకవేల పరిధికి మించి అప్పు తీసుకోవాలంటే కేంద్రం అనుమతి ఇవ్వాలి. ఈ పరిస్థితుల్లో అదనంగా అప్పు తీసుకోవడం సాధ్యం కాదు. అంచనాల కన్నా రెవిన్యూ ఆదాయం పడిపోతే ఈ మేరకు ద్రవ్య లోటు పెరుగుతుంది. ద్రవ్యలోటు ఎఫ్. ఆర్.బి.ఎం చట్ట పరిధిలో ఉండాలంటే తప్పనిసరిగా వివిధ రంగాలకి కేటాయించిన నిధుల్లో కోత పెట్టడం తప్ప రాష్ట్ర ప్రభుత్వానికి వేరే మార్గం లేదు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రజలకిచ్చిన వాగ్దానాలను అమలు పరచటానికి ఈ బడ్జెట్లో నవరత్నాల పథకాలకు నిధులు కేటాయించడం, విశాఖ గిరిజన ప్రాంతం, వెనుకబడిన విజయనగరం, గుంటూరు, పల్నాడు లో వైద్య కళాశాలలు, శ్రీకాకుళం ఉద్దానంలో కిడ్నీ పరిశోధనా వైద్య కేంద్రం ఏర్పాటు చేస్తామనడం, వాటికి రూ.66 కోట్ల చొప్పున నిధులు కేటాయించడం, కడపలో గా అప్పు తీసుకోవడం సాధ్యం ఉక్కు కర్మాగారం నెలకొల్పుతామనడం ఆహ్వానించాల్సినవి.. | అయితే రాష్ట్రాభివృద్ధికి దోహదపడే అనేక రంగాలను ఈ ప్రభుత్వం విస్మరించింది. నిధులను నామమాత్రంగా కేటాయించింది. ముఖ్యంగా పెట్టుబడి వ్యయానికి నిధులు కేటాయించడంలో విఫలమయ్యింది. నీటి వనరుల కల్పన, విద్య, వైద్యం, పరిశ్రమలు, మౌలిక సదుపాయాల కల్పన, వ్యవసాయం తదితర వాటి అభివృద్ధికి కేటాయించే నిధులను పెట్టుబడి వ్యయంలో చూపిస్తారు. వీటిల్లో పెట్టుబడులు అధికంగా పెడితే ఆర్థిక వ్యవస్థలో ఆదాయం వృద్ధి అవుతుంది. ప్రజలకు ఆదాయాలు, పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఈ బడ్జెట్లో రూ. 29,596 కోట్లుగా పెట్టుబడి వ్యయాన్ని ప్రతిపాదించారు. 2018-19లో రూ.28,678 కోట్లు కేటాయించి రూ.25,021 కోట్లకి సవరించిన బడ్జెట్లో కుదించారు. ఇది కూడా ఖర్చు పెట్టారా? లేదా అనేది సందేహమే. గత ఏడాది బడ్జెట్లో కేటాయించిన నిధులు ఏ మేరకు ఖర్చు పెట్టారనేది ఈ బడ్జెట్లో పూర్తి స్థాయిలో ప్రతిబింబించవు. ప్రస్తుత బడ్జెట్ ప్రవేశ పెట్టిన అనంతరం అడ్వకేట్ జనరల్ పరిశీలించిన తర్వాత మరో నాలుగు నెలలకు వాస్తవ లెక్కలు తెలుస్తాయి. ఇవి వచ్చే బడ్జెట్లో మాత్రమే పేర్కొనబడతాయి. 2014-15లో రూ.11,409 కోట్లు, 2015-16లో రూ.14,175 కోట్లు, 2016-17లో రూ.15,180 కోట్లు, 2017-18లో రూ.22,875 కోట్లు మాత్రమే పెట్టుబడి వ్యయం కింద ఖర్చు పెట్టారు. బడ్జెట్ లక్షల కోట్లు దాటినా పెట్టుబడి వ్యయానికి ప్రాధాన్యత ఇవ్వటం లేదు. బడ్జెట్ ఆదాయానికి గండిపడితే మొదట కోతకి గురయ్యేది. పెట్టుబడి వ్యయ కేటాయింపులే. ఈ బడ్జెట్లో కూడా అదే ఉత్పన్నమయ్యింది. 'అమ్మ ఒడి' పథకానికి రూ.6,455 కోట్లు నిధులు కేటాయించినా మొత్తం విద్యారంగ మౌలిక అభివ ఎద్ధికి ఈ బడ్జెట్లో నిధుల కేటాయింపుల్లో తీవ్ర అన్యాయం జరిగింది. నిధుల కేటాయింపులు చూస్తే ప్రభుత్వ విద్యారంగం తీవ్ర ప్రమాదంలో పడుతున్నట్లు అర్థమవుతుంది. రాష్ట్రంలో ఒకటి నుండి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు సుమారు 70 లక్షల మంది ఉన్నారు. మొత్తం 62,182 పాఠశాలల్లో 45,059 ప్రభుత్వ పాఠశాలలుగా ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో సుమారు 45 లక్షల మంది విద్యార్థులు చదువు తున్నారు. 2.86 లక్షల మంది ప్రభుత్వ టీచర్లు ఉన్నారు. ఇంత ప్రాధాన్యత కలిగిన ఈ పాఠశాలల అభివృద్ధికి ఈ బడ్జెట్లో కేవలం రూ.1,500 కోట్లు మాత్రమే కేటాయించారు. వాస్తవంగా రూ.8,012 కోట్లు కేటాయించాలి. ఈ మొక్కుబడి కేటాయింపుల డ పథకానికి రూ.6,455 కోటు విడద | వల్ల ప్రభుత్వ పాఠశాలలు మెరుగు పడవు. నాణ్యత ప్రమాణాలు పెరగవు. ఫలితంగా విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలకు మారే పరిస్థితి ఏర్పడి ప్రభుత్వ పాఠశాలలు మూత పడతాయి. ఇది ప్రమాదకరం. వైద్య రంగానికి గత బడ్జెట్ కంటే 34 శాతం నిధులు అధికంగా పెంచామని, మొత్తంగా రూ.11,399 కోట్లు కేటాయించామని పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీ సేవలు రూ.5 లక్షల ఆదాయ పరిధి వరకు విస్తరించారు. కాని ప్రభుత్వ ప్రాథమిక ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రులను, విశాఖలోని కింగ్ జార్జ్ హాస్పటల్, విశాఖ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికెల్ సైన్స్) (విమ్స్) వంటి వాటిని ఉన్నత స్థాయిలో అభివృద్ధి చేయటానికి అవసరమైన నిధులు కేటాయించక పోవడం దారుణం.. జల యజ్ఞానికి పెద్ద పీట వేస్తామని, రాష్ట్రం లోని అన్ని పెండింగ్ సాగు నీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎన్నికల్లో పదేపదే చెప్పారు. కాని ప్రభుత్వ తొలి బడ్జెట్లో నీటి ప్రాజెక్టులకు గత ప్రభుత్వం కంటే అన్యాయంగా నిధులు కేటాయించారు. 2018-19 కంటే 22.61 శాతం కోత పెట్టి రూ.13,139 కోట్లు కేటాయించారు. ఇందులో పోలవరానికి రూ. 5,254 కోట్లు. మొత్తం ఉత్తరాంధ్ర నీటి ప్రాజెక్టులకు రూ.4,88 కోట్లు కేటాయించారు. ఇందులో ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి రూ.170 కోట్లు, తోటపల్లికి రూ.156 కోట్లు కేటాయించారు. ఈ కేటాయింపులతో ఉత్తరాంధ్ర లోని నీటి ప్రాజెక్టులకు ఒరిగేదేమీ ఉండదు. ఇలా అయితే మరో ఇరవై ఏళ్ళకైనా పూర్తికావు. వెనుకబడిన రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లోని హంద్రీ-నీవా, తెలుగు గంగ, వెలిగొండ, గాలేరు-నగరి తదితర ప్రాజెక్టులకు కేటాయించిన కేటాయింపులు కూడా ఖర్చు పెడతారనే గ్యారంటీ ఏమీ లేదు. పై వచ్చే ఆదాయం కూడా తగ్గుతుంది. కాని ఈ బడ్జెట్లో మద్యం అమ్మకాల పై ఎక్సైజ్ పన్ను ద్వారా రూ.8,517 కోట్లు వస్తుందని చూపించారు. ఇది గత ఏడాది బడ్జెట్ కంటే రూ.2,297 కోట్లు అంటే 36 శాతం ఎక్కువ. దీన్ని బట్టి మద్య నిషేధ విషయంలో ప్రభుత్వం మాట తప్పుతుందా? అనే అనుమానం కలుగుతున్నది. ఈ బడ్జెట్కు పట్టణాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు అవసరమైన నిధులు కేటాయించలేదు. అమరావతికి రూ.500 కోట్లే ప్రతిపాదించారు. నిరుద్యోగ భృతి రద్దు చేశారు. రైతుల వడ్డీ లేని రుణాలకు రూ.3,500 కోట్లు అవసరం కాగా రూ.100 కోట్లే కేటాయించారు. 45 నుండి 60 ఏళ్ళ మధ్య ఉన్న మహిళల జీవనోపాధి కల్పనకు ఆర్థిక చేయూత పథక అమలును వచ్చే ఏడాదికి వాయిదా వేయటం ఆలోచించాల్సిన విషయం. విడద న్న దశల వారీగా నిషేధిసునను