| ముసాయిదాల్లోనే జాతీయ విద్యా విధానం


| జాతీయ విద్యా విధానం ముసాయిదా పాఠశాలల విద్యకు సంబంధించి చేసిన ప్రతిపాదనలలో ముఖ్యమైనది ఇది. ప్రస్తుతం అమలులో ఉన్న 1002 విధానం స్థానంలో 5030304 విధానాన్ని ప్రవేశ పెట్టాలి. ఇప్పుడు 5 సంవత్సరాల ప్రాథమిక విద్య, మూడేళ్ల మాధ్యమిక విద్య, రెండేళ్ల సెకండరీ విద్య, మరో రెండేళ్ల హయ్యర్ సెకండరీ విద్య మొత్తం 12 సంవత్సరాలు అమలులో వుంది. దీనికి బదులు ప్రతిపాదిస్తున్న కొత్త విధానంలో మొదటి అయిదేళ్ల లోనూ మూడేళ్ల ప్రీ-ప్రైమరీ చదువు, రెండేళ్ల ప్రాథమిక విద్య కలిసి వుంటాయి. తర్వాత మూడేళ్లలో మిగిలిన 3,4,5 తరగతులు, ఆ తర్వాత మూడేళ్ల మాధ్యమిక విద్య (6,7,8 తరగతులు) ఉంటాయి. చివరి నాలుగేళ్లూ కలిసి సెకండరీ విద్యగా ఉంటాయి. 10వ తరగతికి, 12వ తరగతికి బోర్డు పరీక్షలు ఉంటాయి. హయ్యర్ సెకండరీ స్థాయిలో (ఇంటర్) ఇప్పుడు సైన్స్, ఆర్ట్స్, కామర్స్-ఇలా వేరు వేరు గ్రూపులు ఉన్నాయి. కొత్త ప్రతిపాదనలో ఇలా విడివిడిగా గ్రూపులు ఉండవు. అన్నీ కలగలిసే వుంటాయి. అదనంగా ఆరో తరగతి నుండీ వొకేషనల్ సబ్జెక్టులు, రకరకాల వృత్తి నైపుణ్య శిక్షణ కూడా ఉంటాయి. ప్రీ ప్రైమరీ దశలో చదువు అనే ప్రతిపాదన స్వాగతించదగ్గది. ప్రైవేటు విద్యా సంస్థల్లో కిండర్ గార్టెన్, ఎల్కేజి, యుకెజి పేర్లతో ఇది అమలులో వుంది. ప్రభుత్వ రంగంలో అంగన్ వాడీ వ్యవస్థ ఉండడంతో ఈ ప్రీ-ప్రైమరీ చదువు విషయంలో ముందడుగు పడలేదు. అయితే ఇప్పుడు అంగన్వాడీ సెంటర్లను ప్రైమరీ స్కూళ్లల్లో విలీనం చేస్తారా లేక, ఒకటి, రెండు తరగతులను అంగన్ వాడీలకు బదలాయిస్తారా అన్న విషయంలో ముసాయిదా స్పష్టంగా ఏమీ చెప్పలేదు. నా అభిప్రాయంలో అంగన్ వాడీ సెంటర్లను ప్రైమరీ పాఠశాలలో విలీనం చేయడమే సరైన చర్య అవుతుంది. ఏదిఏమైనా ఇటువంటి ముఖ్యమైన ప్రతిపాదనను ఏవిధంగా ఆచరణలోకి తేవాలనే విషయంలో ముసాయిదా రూపర్తలకు స్పష్టత లేకపోవడం శోచనీయం. పాఠశాల విద్యా రంగాన్ని విస్తరింప జేయాలని, బలోపేతం చేయాలని, ఇందుకు అధిక మొత్తంలో నిధులు కేటాయించాలని ముసాయిదా లో పేర్కొన్నారు. అయితే అదే సమయంలో 30 మంది కంటే తక్కువ మంది విద్యార్థులుండే పాఠశాలలను మూసివేసి సమీపంలో ఉండే పెద్ద స్కూళ్లతో విలీనం చెయ్యాలని ఇందులో సూచించారు. దీని లోతు పాతులను మనం చూడాల్సి వుంది. పాఠశాల విద్యకు సంబంధించి క్రోడీకరించ బడిన జిల్లా వారి సమాచారాన్ని గనుక పరిశీలిస్తే దేశం మొత్తం మీద ఉన్న ప్రాథమిక పాఠశాలల్లో 30 మంది కంటే తక్కువ విద్యార్థులున్నవి ఏకంగా 40 శాతం ఉన్నాయి. ఒకే గ్రామంలో 30 మంది కంటే తక్కువ మంది ఉన్న స్కూళు ఆ రెండు గాని, మూడు గాని ఉంటే వాటిని విలీనం చేసి ఒక స్కూలుగా నడపవచ్చును. అయితే ఆ గ్రామంలో సామాజిక వివక్షత, అంతరాలు ఏ మోతాదులో ఉన్నాయనేది కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి వుంటుంది. ఇంకో కోణం నుంచి కూడా మనం పరిశీలించాల్సి వుంటుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం 2000 మంది లోపు జనాభా వున్న గ్రామాలు దేశంలో 70 శాతం. వెయ్యి లోపు జనాభా ఉన్నవి 59.5 శాతం. 500 లోపు ఉన్నవి 37.5 శాతం. 30 మంది లోపు పిల్లలు ఉన్న స్కూళ్లను గనుక మూసేస్తే దాదాపు 60 శాతం గ్రామాలలో ప్రాథమిక పాఠశాలలే లేకుండా పోతాయి. 3 నుండి 8 ఏళ్ల వయస్సు పిల్లలు జనాభాలో 12 శాతం ఉన్నారు. వెయ్యి జనాభా ఉంటే స్కూలుకు సరిపడా పిల్లలు ఉంటారు. అయితే చిన్న సంఖ్యలో జనాభా వుండే గ్రామాల మాటేంటి? ఇవన్నీ కొండల్లో, మారుమూల ప్రాంతాలలో గిరిజన ప్రాంతంలో ఉండేవే. ఎటువంటి రవాణా సౌకర్యానికీ నోచుకోనివే ఎక్కువ. ఈ ప్రాంతాల్లో స్కూలుకు 30 మంది పిల్లలు ఉండరు. ముసాయిదా చెప్పినట్లు ఈ స్కూళ్లను మూసేస్తే పక్క ఊరికి పంపడం కూడా సాధ్యం కాదు. అంటే ఎవరికి చదువు అత్యంత అవశ్యమో ఆ వెనకబడిన ప్రాంతాల, తరగతుల పిల్లలకు చదువు లేకుండా చేయడమే! బోధనలో నాణ్యత పెరగాలని ముసాయిదా చేస్తోంది. మంచిదే. ఈ మాటనే కొఠారి కమిషన్ చెప్పింది. 1986 విద్యా విధానమూ చెప్పింది. అయితే బోధనలో నాణ్యత ఎందుకు కొరవడుతోందో ఆ కారణాల జోలికి మాత్రం ముసాయిదా పోలేదు. చిన్న స్కూళ్లను మూసెయ్యాలన్న యావే తప్ప మన ప్రాథమిక పాఠశాలల్లో మూడింట రెండొంతుల్లో టీచర్ల సంఖ్య స్కూలుకు 3 కంటే తక్కువగా ఉందన్న వాస్తవాన్ని ముసాయిదా పట్టించుకోలేదు. ఒక ప్రైవేటు ప్రైమరీ స్కూలులో సగటున 8 మంది టీచర్లు ఉన్నారు. అప్పర్ ప్రైమరీ స్కూలులో ప్రైమరీతో కలిపి సగటున 12 మంది ఉన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో టీచర్ల సంఖ్య కన్నా ఇది చాలా ఎక్కువ. ప్రభుత్వ స్కూళ్లలో ఏకోపాధ్యాయ స్కూళ్లలోను, ఇద్దరే టీచర్లు ఉన్న స్కూళ్లలోను పిల్లల హాజరు శాతం తక్కువగా ఉంటోంది. అదే ముగ్గురు, ఆపైన గనుక టీచర్లు ఉంటే పిల్లల హాజరు శాతం మెరుగ్గా ఉంటోంది. నియమించడం బోధనా నాణ్యతలో మొదటి చర్య అని అర్థం కావడం లేదా? నేను 2010లో పంజాబ్ లోని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లను పరిశీలించినపుడు మెరుగైన మౌలిక వసతులు, ఆరుగురు కన్నా ఎక్కువ మంది టీచరు ఉన్న ప్రైవేటు స్కూలు కంటే అయిదుగురు టీచరున్న ప్రభుత్వ స్కూళ్లల్లో బోధనా నాణ్యత మెరుగ్గా ఉండడం గమనించాను. కనుక ఈ అంశాన్ని దాటవెయ్యకూడదు. డిటెన్షన్ పాలసీ విద్యా హక్కు చట్టం ప్రకారం 10వ తరగతి వరకూ డిటెన్షన్ ఉండకూడదు. అయితే ఈ ముసాయిదా మాత్రం 3,5,8వ తరగతులలో విద్యార్థుల స్థాయిని గణించే పరీక్షలను నిర్వహించాలని ప్రతిపాదిస్తోంది. ప్రస్తుతం 10వ తరగతి వరకూ డిటెన్సన్ లేకపోయినా, విద్యారి సమగ్ర వికాసాన్ని సమర నిరంతర మూల్యాంకనం (సినీఇ) పధతిన పెంపొందించే విధానం ఉంది. ఈ సిసిఇ పధతి అమలు సక్రమంగా లేదు. దాని వలన డిటెన్షన్ ఉండకూడదన్న విధానం విద్యార్థుల నాణ్యతను పలుచన చేస్తోందన్నది నిజమే. కాని దీనికి ముసాయిదా చెప్పిన విదారుల సాయిని గణించే పరీక్ష విధానం పరిష్కారం కాజాలదు. నిజానికి ఇటువంటి అనాలోచిత విధానం పేద, వెనకబడిన | తరగతుల పిల్లలను ప్రాథమిక దశలోనే చదువుకు దూరం చేస్తుంది. “సార్వత్రిక ప్రాథమిక విద్య ప్రస్తుతం హక్కుగా ఉంది. ఉన్నత విద్యనూ సార్వత్రికం చేయాలన్న లక్ష్యాన్ని ఇప్పుడు ప్రకటిస్తున్నారు. దీనిని ఏవిధంగా సాధిస్తారు? ప్రతి 100 ప్రైమరీ స్కూళ్లకు 50 అప్పర్ ప్రైమరీ, 20 సెకండరీ, 8 హయ్యర్ సెకండరీ స్కూళ్లు ఇప్పుడు ఉన్నాయి. అందరూ ఉన్నత విద్యా స్థాయికి చేరుకోవాలంటే ప్రైమరీ స్కూళ్లలో చేరిన పిల్లలందరినీ ఇముడ్చుకోగలిగినన్ని సెకండరీ, హయ్యర్ సెకండరీ స్కూళ్లు ఉండాలి కదా? అయితే ముసాయిదా రూపకర్తలు దీనిని తిరగేసి చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న సెకండరీ, హయ్యర్ సెకండరీ స్కూళ్లకు సరిపడా విద్యార్థులను అందించేలా ప్రైమరీ స్కూళ్లను కొనసాగించి తక్కినవి మూసివేసే సూచన చేశారు కదా! స్వాతంత్ర్యానంతరం నెహ్రూ, మౌలానా ఆజాద్ నేత ఎృత్వంలో అమలులోకి వచ్చిన విద్యా విధానం కేవలం సాంకేతికాభివృద్ధి సాధించడానికి దోహదపడటమే గాక సామాజిక అసమానతలను, అంతరాలను తగ్గించడానికి కూడా తోడ్పడింది. వెట్టి చాకిరీ నుండి, సాంప్రదాయ బంధనాల నుండి అట్టడుగు వర్గాల ప్రజలు విముక్తి పొందడానికి అవసరమైన ప్రేరణ కల్పించింది. 1960, 1970 దశకాల నాటికి ఈ మార్పు ప్రస్ఫుటంగా కనపడింది. అయితే విద్యను సాంప్రదాయంగా తమ పెత్తనం అయితే విద్యను సాంప్రదాయంగా తమ పెత్తనం కంద ఉంచుకున్న సామాజిక తరగతులు, సంపన్న | కింద ఉంచుకున్న సామాజిక తరగతులు, సంపన్న వర్గాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, సైనికోద్యోగులు నాణ్యత లేమిని కారణంగా చూపించి తమ తమ సెక్షన్లకు ప్రత్యేక పాఠశాలలను డిమాండ్ చేసి సాధించుకున్నారు. దాంతో మోడల్ స్కూళ్లు, సెంట్రల్ స్కూళ్లు, సైనిక స్కూళ్లు, రైల్వే స్కూళ్లు వచ్చాయి. తర్వాత నవోదయ పాఠశాలలు వచ్చాయి. ఇక ఆ తర్వాత ప్రైవేటు రంగంలో హెచ్చు. ఫీజులు వసూలు చేసే స్కూళ్లు పుట్టుకొచ్చాయి. చివరికి ప్రభుత్వ స్కూళ్లు అంటే ఎటువంటి సౌకర్యాలూ ఉండని తగినంత సిబ్బంది ఉండని స్కూళ్లుగా సామాజికంగా, ఆర్థికంగా వెనకబడిన తరగతుల పిల్లలకే పరిమితం అయ్యే స్కూళుగా మిగిలాయి. స్వాతంత్ర్యం రాక మునుపు ఉన్న సామాజిక అంతరాలు, వివక్ష విద్యా రంగంలో పెరగడానికి 1960, 70 వరకు సాధించి కొద్దిపాటి పురోగతిని కూడా తిరగదోడడానికి ఈ మార్పులు దారితీశాయి. ఇప్పుడీ 'జాతీయ విద్యా విధాన ముసాయిదా' ఆ అంతరాలను తగ్గించడం పోయి మరింత పెంచే దిశగా సిఫార్సులు చేసింది. అతి కొద్దిమంది 'సమర్థులు', 'రోబో'లను తయారు చేసే వారుగా తయారవుతారు. చాలా ఎక్కువ మంది చౌకగా ప్రపంచ మార్కెట్లో అమ్ముడు పోయే శ్రామికులుగా శిక్షణ పొందుతారు! విద్యా హక్కు చట్టాన్ని పునఃసమీక్ష చేయాలని కూడా ఈ ముసాయిదా చెప్తోంది. ఆ చట్టంలో ఉన్న పరిమిత హక్కులు సైతం నీరుగార్చడమే జరుగుతుంది తప్ప అందుకు భిన్నంగా జరుగుతుందని ఆశించలేము. మొత్తంగా చూస్తే ఈ ముసాయిదాలో కొత్తదనం ఏమీ లేదు సరికదా కునారిల్లుతున్న మన విద్యా విధ కునారిల్లుతున్న మన విద్యా విధానాన్ని మరింత వెనక్కి నెట్టడానికే తోడ్పడేదిగా ఉంది.