మానవతే పునాది.. సేవే పరమావధి


ప్రార్థించే పెదవుల కన్న.. సాయం అందించే చేతులు మిన్న అనటమే కాదు... ఆచరించి ప్రపంచానికే ఆదర్శంగా నిలిచారు మదర్ థెరిస్సా. ఆమె స్ఫూర్తితో ఎందరో మహానుభావులు తమ సేవా నిరతిని చాటుకున్నారు. మరెందరో అనేక విధాలుగా సేవ పేరుతో సంస్థలు ప్రారంభించి ప్రజా ప్రయోజన కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహిం చారు. మరికొందరు తమ స్వార్ధం కోసం సంస్థలు స్థాపించి లక్ష్యం నెరవేరిన తర్వాత సేవకు స్వస్తి పలుకడం చారిత్రికంగా నిరూపణ అయిన సత్యం. రక రకాల పేర్లతో అనేక సేవాసంస్థలు ప్రారంభం కావడం.. విస్తృత ప్రచారం పొందటం ఆ తర్వాత జనంమీద పడి చందాల పేరుతో వసూళ్లు ప్రారంభించి పబ్బం గడుపుకునే సంస్థలు అనేకం. అలాంటి కొన్ని సంస్థలకు భిన్నంగా ఒక నిర్దిష్టమైన లక్ష్యంతో ప్రారంభమైన సంస్థలు కూడా లేకపోలేదు. సామాజిక సేవే కొలబద్దంగా .. మానవీయ ఉపకారమే మార్గంగా .. లబ్దిదారుల ఆనందమే ప్రతిఫలంగా ..ఆవిర్భవించిందే గార్లపాటి ఫౌండేషన్